పాటపాడిన బాలకృష్ణ.. వీడియో కాల్‌లో బన్నీ
close
Published : 05/06/2020 13:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాటపాడిన బాలకృష్ణ.. వీడియో కాల్‌లో బన్నీ

సోషల్‌మీడియాలో సందడి చేసిన నటీనటులు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతిరోజూ తమకిష్టమైన వ్యాపకాలతో నిండిపోయే సెలబ్రిటీల సోషల్‌మీడియా వాల్స్‌ నేడు పచ్చదనంతో చూపరులను ఆకట్టుకున్నాయి. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలందరూ పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ పోస్ట్‌లు పెట్టారు. మరోవైపు కొంతమంది పేజీలు సెలబ్రేషన్స్‌తో నిండిపోయాయి. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం, సినిమా వార్షికోత్సవానికి సంబంధించిన పోస్ట్‌లతో నెటిజన్లను ఆకట్టుకున్నారు.

సింగర్‌ సింహా పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే’ పాట పాడి సింహాని ఆనందింపజేశారు. అలాగే నటుడు విశ్వక్‌సేన్‌ తన మేనేజర్‌ పుట్టినరోజును జరిపించారు. తన తల్లి జోగులాంబకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సింగర్‌ స్మితా ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని యాంకర్‌ అనసూయ ఇంట్లోనే సెలబ్రేట్‌ చేసుకున్నారు. మరోవైపు ‘వేదం’ సినిమా విడుదలై పది సంవత్సరాలైన సందర్భంగా క్రిష్‌, బన్నీ, కీరవాణి, మంచుమనోజ్‌, అనుష్క, చిత్ర నిర్మాతలు వీడియో కాల్‌లో సరదాగా సంభాషించుకున్నారు. ఆనాటి సంగతులను గుర్తుచేసుకుని ఆనందించారు. అంతేకాకుండా రాశీఖన్నా పాత ఫొటోలతో మెప్పించగా, పూజా హెగ్డే తన బామ్మతో సరదాగా గడిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని