మాధవీలత.. పెళ్లి చేసుకోనున్నారా..?
close
Updated : 06/06/2020 10:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాధవీలత.. పెళ్లి చేసుకోనున్నారా..?

వైరల్‌గా మారిన నటి పోస్ట్‌

హైదరాబాద్‌: నటి మాధవీలత త్వరలోనే పెళ్లి కబురు చెప్పనున్నారా?.. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ఆమె తరచూ అందుబాటులో ఉంటారు. తన రోజువారీ లైఫ్‌స్టైల్‌ గురించి నెటిజన్లతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ‘కొన్ని నెలల తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభమైంది. జీవితంలో అద్భుతాలు జరుగుతాయని నేను ఎప్పుడూ నమ్ముతుంటాను. అలాగే నా జీవితంలో కూడా అద్భుతాలు జరిగాయి. వాటివల్ల నేను చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. త్వరలోనే నా సంతోషానికి గల కారణం ప్రకటిస్తాను.’ అని మాధవీలత పేర్కొన్నారు.

మాధవీలత పెట్టిన పోస్ట్‌తో నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ‘రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా’ అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. ‘లేదు నేను రాజకీయాల్లోనే ఉంటున్నాను’ అని ఆమె తెలిపారు. దీంతో ఆమె వివాహం చేసుకోనున్నారంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ‘మేడమ్‌ మీరు ప్రేమలో పడ్డారా? మీరు త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారా?’ అని కామెంట్లు పెడుతున్నారు.

రవిబాబు దర్శకత్వం వహించిన ‘నచ్చావులే’ చిత్రంతో మాధవీలత వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అనంతరం ఆమె తెలుగులో తెరకెక్కిన పలు చిత్రాల్లో సందడి చేశారు. నాని కథానాయకుడిగా నటించిన ‘స్నేహితుడా’ చిత్రంలో మాధవీలత కథానాయికగా మెప్పించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని