సల్మాన్‌ ఫాంహౌస్‌లో ఏం చేస్తున్నారు?
close
Updated : 06/06/2020 19:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సల్మాన్‌ ఫాంహౌస్‌లో ఏం చేస్తున్నారు?

కీర్తి న్యూలుక్‌.. రవిబాబు వీడియో వైరల్‌!

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌లో షూటింగ్‌లు లేకపోవడంతో సినీ తారలు ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. కొందరు తమ విశేషాలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తన ఫాంహౌస్‌ పరిసరాల్లో పడ్డ చెత్తను ఊడుస్తున్నారు. ఆయన ప్రేయసిగా ప్రచారంలో ఉన్న యూలియా వంటుర్‌ కూడా పనిచేస్తూ కనిపించారు. ఈ వీడియోను సల్మాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. టాలీవుడ్‌ నటుడు రవిబాబు మార్కెట్‌కు వెళ్లిన వీడియో వైరల్‌ అవుతోంది. ఓ సూపర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ముందు సెక్యూరిటీ గార్డు రవిబాబు శరీర ఉష్ణోగ్రతను పరీక్షించారు. ఆయన తిరిగి సెక్యూరిటీ గార్డు ఉష్ణోగ్రతను పరిశీలించి.. లోపలికి వెళ్లారు. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను నవ్వించింది.

మహేశ్‌బాబు కుమార్తె సితార ఇంట్లో తన తల్లి నమ్రతకు సాయం చేసింది. చిన్నారి చెత్త ఊడుస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. కథానాయిక కీర్తి సురేశ్‌ నటిస్తోన్న సినిమా ‘పెంగ్విన్‌’. ఈ సినిమాను నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో జూన్‌ 19న విడుదల చేయబోతున్నారు. జూన్‌ 8న ఈ చిత్రం టీజర్‌ విడుదల కాబోతోందని చిత్ర బృందం శనివారం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. కీర్తి సురేశ్‌ గాయాలతో, కంటతడి పెట్టుకుని కనిపించారు. ఇలా మన తారలు షేర్‌ చేసిన విశేషాలు చూడండి..


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని