‘నో పెళ్లి’ అంటోన్న టాలీవుడ్‌ సింగర్స్‌
close
Published : 07/06/2020 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నో పెళ్లి’ అంటోన్న టాలీవుడ్‌ సింగర్స్‌

యూట్యూబ్‌లో దూసుకెళ్తోన్న వీడియో

హైదరాబాద్‌: ఎన్నో సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్‌ సింగర్స్‌ ప్రస్తుతం ‘నో పెళ్లి’ అంటున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్రంలోని ఓ పాటకు వీరందరూ కవర్‌ వెర్షన్‌ రూపొందించారు. తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల అర్మాన్‌ మాలిక్‌ పాడిన ‘నో పెళ్లి’ పాటను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పాటకు కవర్‌ వెర్షన్‌లో రమ్య బెహరా, మనీషా ఎర్రబాతిని, రేవంత్‌, కృష్ణ చైతన్య, ధనుంజయ్‌, శ్రీరామచంద్ర, లిప్సిక, ధామిని, గీతామాధురి, దీపు, రోల్‌ రైడా. ఇలా గాయనీ గాయకులందరూ కలిసి మెప్పించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ 2 లక్షల మంది వీక్షించారు.

గతేడాది విడుదలైన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా వెండితెరకు పరిచయం కానున్నారు. నభానటేశ్‌ కథానాయిక. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని