విజయవాడ చేరుకున్న సినీ ప్రముఖులు
close
Published : 09/06/2020 12:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయవాడ చేరుకున్న సినీ ప్రముఖులు

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డితో ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు సినీ ప్రముఖులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కొరటాల శివ, సురేష్‌బాబు, సి.కల్యాణ్‌, జీవిత తదితరులు హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రంలో సినీరంగం అభివృద్ధిపై సీఎంతో చర్చించనున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో చిత్రీకరణకు అనుమతులు ఇవ్వడంపై జగన్‌కు ధన్యవాదాలు తెలపనున్నారు. పలు ప్రాంతాల్లో ఉచితంగా సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంపైనా  కృతజ్ఞతలు తెలపనున్నారు. విశాఖలో స్టూడియోలు, సినీ ల్యాబ్‌ల నిర్మాణానికి భూమి కేటాయించాలని సినీ ప్రముఖులు కోరనున్నట్టు సమాచారం.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని