సినిమా అడ్వాన్స్‌ తీసుకుని.. విరాళంగా ఇచ్చి..!
close
Published : 10/06/2020 22:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినిమా అడ్వాన్స్‌ తీసుకుని.. విరాళంగా ఇచ్చి..!

రాఘవా లారెన్స్‌ గొప్పతనం

చెన్నై: తమిళ నటుడు, దర్శకుడు రాఘవా లారెన్స్‌ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా సమయంలో ఆయన ఇప్పటికే దాదాపు రూ.4 కోట్లు వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు. తాజాగా పారిశుద్ధ్య కార్మికుల కోసం రూ.25 లక్షలు విరాళం అందించారు. మొత్తం 3385 మందికి ఈ మొత్తం పంచారు. తను పనిచేయబోతున్న సినిమా కోసం నిర్మాణ సంస్థ నుంచి అడ్వాన్స్‌ తీసుకుని విరాళం ఇవ్వడం గొప్ప విషయం. లారెన్స్‌ త్వరలో ఫైవ్‌ స్టార్‌ క్రియేషన్స్‌తో కలిసి పనిచేయబోతున్నారు. వారి నుంచి ముందస్తుగా డబ్బులు తీసుకుని.. బ్యాంక్‌ సిబ్బంది సాయంతో పారిశుద్ధ్య కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ‘మనం సురక్షితంగా ఉండటం కోసం పరిసరాల్ని శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఇప్పుడు దేవుళ్లతో సమానం’ అని ఈ సందర్భంగా లారెన్స్‌ అన్నారు.

లారెన్స్‌ నటించిన ‘ముని 4’ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లారెన్స్‌ ‘ముని 2’కు రీమేక్‌గా హిందీలో రూపొందిస్తున్న ‘లక్ష్మీబాంబ్‌’కు దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ ఇందులో లారెన్స్‌ పాత్ర పోషిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ఈ ఏడాది మార్చి ఆరంభంలో చిత్రీకరణ పూర్తయింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని