చిచ్ఛా.. నా పుట్టినరోజు ఆగస్టులో..!
close
Updated : 11/06/2020 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిచ్ఛా.. నా పుట్టినరోజు ఆగస్టులో..!

రాహుల్‌ సిప్లిగంజ్‌

హైదరాబాద్‌: తన పుట్టినరోజు గురించి కొంతమంది నెటిజన్లకు స్పష్టత ఇచ్చారు గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌. హుషారేత్తించే పాటలతో అలరించే రాహుల్‌కు అభిమానులు ఎక్కువనే విషయం తెలిసిందే. అయితే, బుధవారం రాహుల్‌ పుట్టినరోజుగా భావించిన చాలామంది నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు, పోస్టులు పెట్టారు. #HBDRahul అంటూ వరుస పోస్టులు దర్శనమిచ్చిన క్రమంలో ఇన్‌స్టా వేదికగా ఆయన స్పందించారు. తన పుట్టినరోజుకి ఇంకా చాలా సమయముందని పేర్కొన్నారు. ‘ఈ రోజు నా పుట్టినరోజు కాదు. ఆగస్టు 22న నా పుట్టినరోజు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. లవ్‌ యూ ఆల్‌’ అని రాహుల్‌ తెలిపారు.

కృష్ణవంశీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘రంగమార్తాండ’ చిత్రంలో రాహుల్‌ నటుడిగా కనిపించనున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజశేఖర్‌ కుమార్తె శివాత్మిక సైతం ఈ చిత్రంలో భాగమే. మరాఠిలో మంచి విజయాన్ని సాధించిన ‘నటసామ్రాట్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని