ఈ నెల 29న  ప్రకాశ్‌రాజ్‌ను హతమారుస్తాం!
close
Updated : 27/01/2020 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ నెల 29న  ప్రకాశ్‌రాజ్‌ను హతమారుస్తాం!

ఆయనతోపాటు కుమారస్వామి, నిజగుణానంద స్వామికి బెదిరింపు లేఖ

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: నటుడు ప్రకాశ్‌రాజ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతోపాటు మరో 13 మందిని హత్య చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. సంఘ్‌ పరివార్‌ను విమర్శిస్తూ వస్తున్న నిజగుణానందస్వామికి వచ్చిన ఆ లేఖలో వీరి పేర్లున్నాయి. బెళగావిలోని నిజగుణానందస్వామి మఠానికి ఈ లేఖ వచ్చింది. కన్నడలో ఉన్న ఆ లేఖలో ‘ధర్మ ద్రోహులు, దేశద్రోహులను జనవరి 29న హతమార్చేందుకు ముహూర్తం పెట్టాం. మీ చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. నిజగుణానందస్వామీ! మీరు ఒక్కరే కాదు. దిగువ ఉన్న పేర్లను చూడండి. వారిని కూడా చివరి ప్రయాణానికి మీరే సిద్ధం చేయాలి’ అని ఉంది. ఈ లేఖను బెళగావి జిల్లా ఎస్పీకి ఆశ్రమవాసులు అందజేశారు. ఆశ్రమానికి అదనపు భద్రత కల్పిస్తామన్న పోలీసుల సూచనలను మఠాధిపతి తిరస్కరించారు. తనకూ బెదిరింపులు వచ్చాయని కుమారస్వామి శనివారం వరుస ట్వీట్లు చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని