పాఠశాల వ్యాను దగ్ధం: 4గురు విద్యార్థులు మృతి
close
Published : 16/02/2020 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాఠశాల వ్యాను దగ్ధం: 4గురు విద్యార్థులు మృతి

చండీగఢ్‌: పంజాబ్‌లోని సంగ్రుర్‌ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల చిన్నారులు ప్రయాణిస్తున్న వ్యానులో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల ముగిసిన అనంతరం 12 మంది విద్యార్థులు వ్యానులో ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా వారి వ్యానులో మంటలు వ్యాపించాయి. డ్రైవర్‌ అప్రమత్తమై వ్యాను ఆపే లోపే వ్యాను మొత్తం అగ్గి వ్యాపించింది. వేగంగా 8మంది విద్యార్థుల్ని కాపాడినప్పటికీ.. నలుగురు మంటల కారణంగా దుర్మరణం పాలయ్యారు. కాగా ఈ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ స్పందించారు. విద్యార్థుల సజీవ దహనాన్ని బాధాకర ఘటనగా వర్ణించారు. ఘటనపై దర్యాప్తుకు అధికారులను ఆదేశించినట్లు.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని