చర్చి వద్ద  కాల్పులు.. 24మంది మృతి
close
Published : 18/02/2020 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చర్చి వద్ద  కాల్పులు.. 24మంది మృతి

బుర్కినా ఫాసోలో ఉగ్రవాదుల ఘాతుకం 

వాగాడొగౌ: ఆఫ్రికాలోని బూర్కినాఫాసోలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకొని చర్చి వద్ద జరిపిన కాల్పుల్లో చర్చి పాస్టర్‌ సహా 24 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. మరికొందరిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసినట్టు సమాచారం.  నార్త్‌ బూర్కినా ఫాసోలోని ఓ గ్రామంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుందని ప్రాంతీయ గవర్నర్‌ వెల్లడించారు. ఓ సాయుధ ఉగ్రవాదుల సమూహం యఘా ప్రావిన్స్‌లోని పాన్సీలోకి ప్రవేశించిందనీ..  అక్కడి జనంపై దాడులకు తెగబడిందని తెలిపారు. ఈ ఘటనలో పాస్టర్‌తో పాటు 24 మంది మృతిచెందారనీ.. 18 మంది గాయాపడ్డారని అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు కొందరిని అపహరించి తమ వెంట తీసుకెళ్లారని తెలిపారు. 

బుర్కినాఫాసో జిహాదీ ఉగ్రవాదులకు లక్ష్యంగా మారింది. ఈ ముష్కరుల దాడుల్లో 2015 నుంచి ఇప్పటివరకు 750 మందికి పైగా ప్రజలు మృతి చెందారు.. 6లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10న అనుమానిత జిహాదీలు సెబ్బాలో ఏడుగురిని ఓ పాస్టర్‌ ఇంట్లో నిర్బంధించారు. ఆ తర్వాత మూడు రోజులకు పాస్టర్‌తో పాటు ఐదు మృతదేహాలను ఆ ఇంట్లో గుర్తించినట్టు గవర్నర్‌ తెలిపారు. ఐరాస వెల్లడించిన వివరాల ప్రకారం.. బుర్కినా ఫాసో, మాలి, నైజర్‌ దేశాల్లో కలిపి గతేడాది దాదాపు 4వేల మంది జిహాదీల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని