పాక్‌లో లోయలో పడ్డ బస్సు.. 20మంది మృతి
close
Published : 10/03/2020 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌లో లోయలో పడ్డ బస్సు.. 20మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఘాట్‌లో వెళుతున్న బస్సు లోయలో పడటంతో 20 మంది దుర్మరణం పాలయ్యారు. గిల్గిత్‌ బాల్టిస్థాన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా తెలిపిన వివరాల ప్రకారం.. రావల్పిండి నుంచి స్కర్దుకు ఓ బస్సు 25 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ బస్సు పర్వత ప్రాంతం నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు మరణించగా.. మరో ఆరుగురు గాయాల పాలయ్యారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 8 మంది మృతదేహాల్ని బయటకు తీసినట్లు తెలిపారు. సైనిక హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని