పెట్రోలు పోసుకొని దంపతుల ఆత్మహత్య
close
Published : 28/03/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రోలు పోసుకొని దంపతుల ఆత్మహత్య

రాజమహేంద్రవరం నేరవార్తలు: అనారోగ్య కారణాలు.. సంతానం కలగకపోవడం తదితర కారణాలతో తీవ్ర మనస్తాపం చెందిన దంపతులు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులోని బాబానగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే ప్రాంతానికి చెందిన రాజమండ్రి సతీశ్‌(40), వీరవెంకటలక్ష్మి(30) దంపతులు. సతీశ్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వివాహం జరిగి పదేళ్లకు పైగా అయినా వీరికి సంతానం లేదు. దీని కోసం స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నారు. దీంతో పాటు ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలు రావడం, భార్యకు సైతం కిడ్నీ సమస్య తలెత్తడం.. సంతానం లేదనే వేదనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం స్థానికంగా ఉన్న ఓ ఖాళీస్థలంలో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానిక ప్రకాశ్‌నగర్‌ పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో ‘తమ చావుకు ఎవరూ కారణం కాదు’ అని రాసి ఉన్న నోట్‌తో పాటు వైద్య పరీక్షలకు సంబంధించిన పత్రాలను పోలీసులు గుర్తించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని