ఐదుగురు పిల్లలను గంగానదిలో తోసిన తల్లి
close
Updated : 13/04/2020 13:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐదుగురు పిల్లలను గంగానదిలో తోసిన తల్లి

భార్యాభర్తల మధ్య గొడవే కారణం

లఖ్‌నవూ: భార్యాభర్తల మధ్య గొడవ మూలంగా ఒక తల్లి తన ఐదుగురు పిల్లలను గంగానదిలోకి తోసివేసిన దారుణ ఘటన యూపీలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో వారంతా నదిలో గల్లంతయ్యారు. భదోహి జిల్లా ఎస్పీ రామ్‌బదన్‌సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి ప్రాంతానికి చెందిన మృదుల్‌యాదవ్‌, మంజుయాదవ్‌ భార్యాభర్తలు. వీరికి ఐదుగురు పిల్లలున్నారు. అయితే ఏడాదిగా దంపతులిద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి సైతం వారి మధ్య గొడవ జరిగింది. దీంతో మంజుయాదవ్ తన ఐదుగురు పిల్లలను తీసుకుని జహంగీరాబాద్‌లోని గంగానదిఘాట్ వద్దకు చేరుకుంది. ఒక్కసారిగా తన ఐదుగురి పిల్లల్ని నదిలోకి తోసివేయగా వారు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. పిల్లల్ని తోసివేస్తున్న క్రమంలో వారు గట్టిగా కేకలు పెట్టడంతో సమీపంలో ఉన్న స్థానికులు వారిని కాపాడాల్సింది పోయి.. ఆమె ఒక మంత్రెగత్తెగా భావించి అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం మంజుయాదవ్‌ నది ఒడ్డు వద్దనే ఉండి ఆదివారం ఉదయం గ్రామస్థులకు తెలిపింది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే పిల్లులు కొట్టుకుపోయిన ప్రాంతానికి చేరుకొని గాలింపు చేపట్టారు. జహంగీరాబాద్‌ ఘాట్‌ వద్ద భారీ ప్రవాహం, లోతు ఎక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని