‘లూడో’లో ఓడించిందని భార్యపై దాడి
close
Published : 28/04/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘లూడో’లో ఓడించిందని భార్యపై దాడి

గుజరాత్‌లోని వడోదరలో ఘటన

వడోదర: లాక్‌డౌన్‌ నేపథ్యంలో కాలక్షేపం కోసం భార్యాభర్తలు లూడో ఆడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె.. వరుసగా అతన్ని ఓడించింది. దీంతో ఆగ్రహం చెందిన అతను.. ఆమెను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. వెన్నుముకకు తీవ్ర గాయాలు కావడంతో బాధితురాలు ఆస్పత్రిపాలయ్యింది. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదర సమీపంలో చోటుచేసుకుంది. భార్య తనకంటే తెలివైందనే ఆత్మన్యూనతాభావానికి లోనై.. ఈ క్రమంలో అహం దెబ్బతినడంతో అతను ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు స్థానికంగా ఓ కౌన్సెలర్‌ వివరించారు. చికిత్సనంతరం ఆమె కొన్నాళ్లపాటు తన తల్లిదండ్రులవద్దే ఉండేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా లాక్‌డౌన్‌ వేళ మహిళలపై గృహ హింస కేసులు పెరుగుతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని