మహారాష్ట్ర TO యూపీ.. కాంక్రీట్‌ మిక్సర్‌లో!
close
Published : 03/05/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్ర TO యూపీ.. కాంక్రీట్‌ మిక్సర్‌లో!

ఇండోర్‌: లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకున్న వలస కూలీలు తమ స్వస్థలాకు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలను అనుసరిస్తున్నారు. ఓ వైపు కూలీల తరలింపునకు కేంద్రం చర్యలు చేపడుతున్నప్పటికీ ఎలాగైనా స్వగ్రామానికి చేరుకునేందుకు తమ ప్రయత్నాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర నుంచి యూపీకి వలస కూలీలతో వెళుతున్న  కాంక్రీట్‌ మిక్సర్‌ ట్రక్కును మధ్యప్రదేశ్‌ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఇరుకుగా ఉండే ఆ  కాంక్రీట్‌ మిక్సర్‌లో 18 మంది కూలీలు వెళుతుండడం చూసి ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు 35 కి.మీ. దూరంలో ఉన్న ఓ చెక్‌ పాయింట్‌ వద్ద తనిఖీ చేయగా ఈ విషయం వెలుగుచూసింది. అనుమానస్పదంగా అనిపించడంతో కాంక్రీట్‌ మిక్సర్‌ ట్రక్కును ఆపిన పోలీసులు.. మిక్సర్‌ తలుపును తెరవగా అందులో వలస కూలీలు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా ఇరుకుగా ఉండే రంధ్రంలోంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 18 మందిలో 14 మంది యూపీకి చెందిన వలస కూలీలు కాగా.. నలుగురు ట్రక్కు యజమానికి చెందిన కూలీలు. వీరంతా మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌ మీదుగా యూపీకి శుక్రవారం రాత్రి బయల్దేరారు. వీరిని వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. పరీక్షల అనంతరం స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సును ఏర్పాటు చేస్తామని, లారీ డ్రైవర్‌పై వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని