1200కి.మీ సైకిల్‌పై ప్రయాణం..మధ్యలోనే..!
close
Published : 04/05/2020 02:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

1200కి.మీ సైకిల్‌పై ప్రయాణం..మధ్యలోనే..!

లఖ్‌నవూ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ వలస కార్మికులు చేస్తున్న సాహస ప్రయాణాలు వారి ప్రాణాలమీదకు తెస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిస్తున్నా తమ సొంత ఊళ్లకు స్వతహాగా ప్రయాణాలు మానడం లేదు. ఈ క్రమంలో కొందరు కాలినడకన వెళ్తుండగా మరికొందరు అందుబాటులో ఉన్న వాహనాలపై ప్రయాణిస్తున్నారు. తాజాగా దిల్లీ నుంచి బిహార్‌కు సైకిల్‌పై బయలుదేరిన యువకుడు మార్గమధ్యంలోనే మృతిచెందిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

బిహార్‌లోని ఖగారియా జిల్లాకు చెందిన ధర్మవీర్‌ కుమార్‌(28)అనే యువకుడు దిల్లీలోని షాకూర్‌ బస్తీలో కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నిరోజులు దిల్లీలోనే ఉండిపోయాడు. తాజాగా ధర్మవీర్‌ మరో ఆరుగురు స్నేహితులతో కలిసి దిల్లీ నుంచి దాదాపు 1200కి.మీ దూరంలో ఉన్న ఖగారియా(బిహార్‌)కు సైకిళ్లపై ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో 350కి.మీ పాటు సాగిన సైకిల్‌ ప్రయాణం ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ జిల్లాకు చేరుకుంది. పగలు మొత్తం సైకిల్‌ ప్రయాణం చేసిన ఈ యువకులు చీకటి పడడంతో దిల్లీ-బరేలీ మార్గంలోని ఓ టోల్‌ప్లాజా సమీపంలో నిద్రకు ఉపక్రమించారు. మరుసటి ఉదయాన్నే అందరూ నిద్రలేవగా ధర్మవీర్‌ మాత్రం మేల్కొనలేదు. అచేతన స్థితిలో ఉన్న అతన్ని పోలీసుల సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆ యువకుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుదీర్ఘ సైకిల్‌ ప్రయాణంతో బాగా నీరసించి పోవడం వల్లే ధర్మవీర్‌ చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. అనంతరం అతనికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌‌ అని తెలిందని షాజహాన్‌పూర్‌ పోలీసులు వెల్లడించారు. యువకుడి మృతదేహాన్ని వారి స్వస్థలం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సమయంలో వలస కార్మికులు సాహస ప్రయాణాలు చేయకుండా స్థానిక అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతిఇచ్చింది. మరోసారి మే 17వరకు లాక్‌డౌన్‌ పొడగించిన నేపథ్యంలో సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వలస కార్మికులు ప్రస్తుతం ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి..

భారత్‌లో 40వేలకు చేరువగా కరోనా కేసులు!

ప్రపంచాన్ని చైనా మభ్యపెట్టిందా?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని