పిట్ట కొంచెం.. కరోనాపై కూత ఘనం!
close
Published : 10/06/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిట్ట కొంచెం.. కరోనాపై కూత ఘనం!

తనకు ప్రమాదముందంటూ కోర్టెక్కిన రెండేళ్ల బుడతడు

×

దిల్లీ: కరోనా వైరస్‌ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ రెండేళ్ల బుడతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కొవిడ్-19 లక్షణాలు బహిర్గతం కాని వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవద్దంటూ దిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం... తనకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటూ కేసు దాఖలు చేశాడు. ఈ మైనర్‌ బాలుడు దిల్లీలో ఉమ్మడి కుటుంబంతో నివసిస్తున్నాడు. నగరంలో లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో... ఉద్యోగులైన అతని కుటుంబసభ్యులు కొందరు విధులకు హాజరవుతున్నారు. వీరి ద్వారా తనకు కొవిడ్‌-19 సోకే ప్రమాదముందని తన తండ్రి ద్వారా దాఖలు చేసిన ఫిర్యాదులో చిన్నారి పేర్కొన్నాడు. ప్రభుత్వ నిర్ణయం ఐసీఎంఆర్ నిబంధనలకు వ్యతిరేకమే కాకుండా.. తనకూ, నగరంలోని మిగిలిన చిన్నారులకూ హానికరమని బాలుడు ఫిర్యాదులో వివరించాడు.

లక్షణాలు కనపడని వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు తిరస్కరించటం, లాక్‌డౌన్‌‌ నిబంధనల సడలింపు రెండూ పరస్పర విరుద్ధ నిర్ణయాలని పిటిషన్‌లో వెల్లడించాడు. లక్షణాలు లేని రోగుల వల్ల కరోనా అతి తక్కువ కాలంలో అత్యధికంగా వ్యాప్తి చెందవచ్చని... వారు మైనర్లకు, వయోవృద్ధులకు ప్రాణాంతకం కాగలరని తెలిపాడు. ఇటువంటి వారికి కూడా నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు అనుమతించటం ద్వారా కొవిడ్‌ వ్యాప్తించకుండా చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంటుందని... తద్వారా దిల్లీలో కరోనా వ్యాప్తిని నిరోధించ వచ్చని కోరాడు. కాగా ఈ కేసును దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పటేల్, జస్టిస్‌ ప్రతీక్‌ జలాన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించనుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని