పెట్రోల్‌ బాటిల్‌తో మహిళ హల్‌చల్‌
close
Published : 14/06/2020 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రోల్‌ బాటిల్‌తో మహిళ హల్‌చల్‌

చౌటుప్పల్‌: తన ఇంటి ముందు హై టెన్షన్‌ విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేయకూడదని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఓ మహిళ ఆందోళనకు దిగింది. తన ఇంటికి సమీపం నుంచి ఏర్పాటు చేసే నిర్మాణాన్ని ఆపకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోల్ బాటిల్‌తో  హల్‌చల్ చేసింది. చౌటుప్పల్‌లో విద్యుత్‌ సబ్-స్టేషన్‌కు అదనపు విద్యుత్‌ జంక్షన్ కోసం రామన్నపేట నుంచి టవర్ ద్వారా విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రామన్నపేట నుంచి చౌటుప్పల్‌ వరకు టవర్ల నిర్మాణం చేపట్టారు. చౌటుప్పల్‌లో టవర్‌ ఏర్పాటు కోసం పునాది తవ్వి నిర్మాణం మొదలు పెట్టారు. అయితే అక్కడ టవర్‌ నిర్మాణం చేపడితే తన ఇంటికి నష్టం జరుగుతుందని.. కూలిపోయే ప్రమాదం ఉందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు ఆపకపోతే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించింది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని