చిత్తూరు జిల్లాలో  ప్రమాదం: ఐదుగురి మృతి
close
Published : 03/07/2020 22:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిత్తూరు జిల్లాలో  ప్రమాదం: ఐదుగురి మృతి

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంభంవారిపల్లె మండలం సొరకాయలపేట చెరువు కట్టపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.  చెరువు కట్టపై వ్యాను, ఆటో ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. క్షతగాత్రులను పీలేరులోని ఆస్పత్రికి తరలించగా.. మరో వ్యక్తి చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుల సంఖ్య ఐదుకి చేరగా.. వీరిలో ముగ్గురు మహిళలే ఉన్నారు. మృతులంతా కలకడ మండలం కొత్తగాండ్లపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా పీలేరు ఆస్పత్రిలో చనిపోయిన బంధువు చివరి చూపునకు వెళ్లి వస్తుండగా ఈ  విషాదం చోటుచేసుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని