కరోనాకు భయపడి వ్యక్తి ఆత్మహత్య
close
Published : 10/07/2020 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాకు భయపడి వ్యక్తి ఆత్మహత్య

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కరోనా వచ్చి ఉంటుందన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు పాతబస్తీ కేవీఆర్‌ గార్డెన్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి (46) స్వర్ణకార వృత్తి చేస్తూ జీవిస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో మార్చి నుంచి ఇంటి వద్దే ఉంటున్న ఆయన రెండురోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. ప్రైవేటు ఆస్పత్రిలో చేరి కరోనా ఉందన్న అనుమానంతో బుధవారం ఓ ప్రైవేటు ల్యాబులో నమూనాలను ఇచ్చారు. ఉదయం కుటుంబీకులు ఆస్పత్రి వద్దే ఉండగా స్నానం చేసి వస్తానంటూ ఇంటికి వచ్చి ఉరేసుకున్నారు. కరోనా పరీక్ష ఫలితం నెగెటివ్‌గానే వచ్చినట్లు పోలీసు విచారణలో తేలింది. కరోనా భయంతో తొందరపడి అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు వారు భావిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని