కొవిడ్‌ సోకిందని వదిలి వెళ్లిన భార్య
close
Published : 11/07/2020 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ సోకిందని వదిలి వెళ్లిన భార్య

కరప, న్యూస్‌టుడే: డయాలసిస్‌ చేయించుకుని ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సులో ఇంటికి వెళ్తుండగా అతడికి కరోనా సోకిందనే సమాచారంతో మధ్యలోనే దింపేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కరపలో చోటుచేసుకుంది. రామచంద్రపురానికి చెందిన సుమారు 55ఏళ్ల వ్యక్తి కాకినాడలో డయాలసిస్‌ చేయించుకున్నారు. రెండు రోజుల క్రితం కొవిడ్‌-19 పరీక్షలు చేశారు. గురువారం సాయంత్రం ఆసుపత్రి నుంచి తన భార్యతో కలిసి రామచంద్రపురానికి వెళ్లేందుకు కాకినాడలో ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఆర్టీసీ సిబ్బంది వారి వివరాలను నమోదు చేసుకున్నారు. వారు ఎక్కిన బస్సు కరప సమీపంలోకి వచ్చేసరికి ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, రిపోర్టు వచ్చేవరకు ఆసుపత్రిలో ఉండాలని సూచించినా వారు ఉండకుండా వచ్చేశారని ఆసుపత్రి వర్గాలు ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించాయి. బస్సులో నుంచి భార్యాభర్తలను దింపేయాలని ఆదేశాలు రావడంతో కరప మార్కెట్‌ సెంటర్‌లో వారిని దింపేశారు. అతడితోపాటు బస్సు దిగిన భార్య కనపడకుండా వెళ్లిపోయింది. బాధితుడు ఒక్కడే నిస్సహాయ స్థితిలో ఉండిపోవడంతో సమాచారమందుకున్న కరప ఏఎస్సై జి.ప్రసన్నకుమార్‌ కాకినాడ జీజీహెచ్‌కు విషయం తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని