ఏపీలో మరో దళిత యువకుడికి శిరోముండనం
close
Updated : 29/08/2020 07:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో మరో దళిత యువకుడికి శిరోముండనం

సినీ నిర్మాత, బిగ్‌బాస్‌-2 ఫేమ్‌ నూతన్‌ నాయుడి ఇంట్లో ఘటన

పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి మండలం గిరిప్రసాద్‌నగర్‌కు చెందిన ఓ దళిత యువకుడికి గుండు గీసి, దాడి చేసిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన పర్రి శ్రీకాంత్‌ (20)కు నాన్నమ్మ, చెల్లి ఉన్నారు. ఉపాధి కోసం విశాఖ తరలివచ్చాడు. సుజాతనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న సినీ నిర్మాత, బిగ్‌బాస్‌-2 ఫేమ్‌ ఎన్‌.నూతన్‌నాయుడి ఇంట్లో నాలుగు నెలల క్రితం పనికి కుదిరాడు. ఈ నెల 1న జీతం తీసుకుని పని మానేశాడు. తమ ఇంట్లో చోరీకి గురైన సెల్‌ఫోన్‌ గురించి మాట్లాడాలని నూతన్‌నాయుడు భార్య గురువారం రాత్రి శ్రీకాంత్‌ను ఇంటికి రప్పించారు. సెల్‌ఫోన్‌ విషయమై నిలదీయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని చెప్పి శ్రీకాంత్‌ వెళ్లిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం మరోసారి తమ సూపర్‌వైజర్‌ ద్వారా శ్రీకాంత్‌ను ఇంటికి పిలిపించారు. నూతన్‌నాయుడి భార్య, ఇంట్లో పనిచేస్తున్న సిబ్బంది అతణ్ని గట్టిగా నిలదీశారు. సెల్‌ఫోన్‌ దొంగిలించినట్లు అంగీకరించకుండా ఎదిరించాడన్న కోపంతో క్షురకుడిని పిలిపించి శ్రీకాంత్‌కు గుండు కొట్టించారు. అంతేగాకుండా రాడ్‌తో దాడి చేసి గాయపరిచారు. విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి పంపేశారు. శ్రీకాంత్‌ మీడియా ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాడు. పెందుర్తి పోలీసులు అతణ్ని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. నార్త్‌ జోన్‌ ఇంఛార్జి ఏసీపీ శ్రావణ్‌కుమార్‌ బాధితుడితో మాట్లాడి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు శనివారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. బాధితుడు అయిదుగురిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అతనే గుండు కొట్టించుకున్నాడు: నూతన్‌నాయుడు
మా ఇంట్లో పర్రి శ్రీకాంత్‌తోపాటు మరో యువతి పనిచేస్తోంది. ఆమె సెల్‌ఫోన్‌లోని చిత్రాలను శ్రీకాంత్‌ తీసుకోవడంతోపాటు స్నేహితులకు పంపి వేధిస్తున్నాడు. యువతి ఈ విషయాన్ని మాకు చెప్పింది. దీనిపై ప్రశ్నించడానికి శ్రీకాంత్‌ను ఇంటికి పిలిపించాం. పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే.. వద్దని బతిమాలాడు. చేసిన తప్పునకు శిక్షగా తనకు గుండు కొట్టించాలని చెప్పి, క్షురకులను ఇంటికి తీసుకొచ్చి గుండు కొట్టించుకున్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని