రషీద్‌ఖాన్‌.. అది ఇప్పట్లో జరిగే పనేనా?
close
Published : 13/07/2020 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రషీద్‌ఖాన్‌.. అది ఇప్పట్లో జరిగే పనేనా?

అఫ్గాన్‌ ప్రపంచకప్‌ గెలిచాకే పెళ్లి అంటున్న స్పిన్నర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ ప్రపంచకప్‌ ఈవెంట్లలో అఫ్గానిస్థాన్‌ ఒక్కసారి విజేతగా నిలిచాకే పెళ్లి చేసుకుంటానన్నాడు ఆ జట్టు సంచలన స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌. తాజాగా ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన సన్‌రైజర్స్‌ బౌలర్‌ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య ఆజాది రేడియోకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా రషీద్‌ మాట్లాడుతూ.. ‘మా జట్టు ఒక్కసారి ప్రపంచకప్‌ గెలవగానే నేను ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని పెళ్లి చేసుకుంటా’ అని పేర్కొన్నాడు. 

రషీద్‌ ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో నంబర్‌ వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు అఫ్గానిస్థాన్‌ ఇప్పటివరకు నాలుగు టీ20లు, రెండు వన్డే ప్రపంచకప్‌లు ఆడింది. అఫ్గాన్‌ 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో ఆడినా కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ గెలిచింది. అది కూడా స్కాట్లాండ్‌ లాంటి చిన్న జట్టు మీద 2015లో విజయం సాధించింది. ఇక గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు.

అయితే ఆ జట్టులో బౌలింగ్‌ విభాగం బాగానే ఉన్నా బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో మెరుగవ్వాల్సింది ఉంది. ఒకవేళ ఆ రెండు విభాగాల్లోనూ మంచి ప్రదర్శన చేస్తే ఆ జట్టు కూడా రాబోయే కాలంలో మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉంది. కాగా, రషీద్‌ మాటలు ట్విటర్‌లో పోస్టు చేయడంతో అదిప్పుడు వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు రషీద్‌పై జోకుల వర్షం కురిపిస్తున్నారు. 2050లోనూ అతడు అఫ్గాన్‌ ప్రపంచకప్‌ గెలుస్తుందనే ఆశతోనే ఉంటాడని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరైతే బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌తో పోల్చుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని