తండ్రైన.. క్రికెటర్‌ అంబటి రాయుడు
close
Published : 14/07/2020 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తండ్రైన.. క్రికెటర్‌ అంబటి రాయుడు

ఇంటర్నెట్ ‌డెస్క్‌: టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌, హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు తండ్రయ్యాడు. ఆయన సతీమణి చెన్నుపల్లి విద్య ఆదివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎప్పుడూ ముక్కుసూటిగా ఉండే అంబటి తన గారాల పట్టిని చిరునవ్వుతో ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాడు.

అంబటి రాయుడు తండ్రైన విషయాన్ని మొదట చెన్నై సూపర్‌కింగ్స్‌ తెలియజేసింది. రాయుడు, విద్య, చిన్నారి ఉన్న చిత్రాన్ని ట్వీట్‌ చేసింది. ‘డాడీస్‌ ఆర్మీ నుంచి మైదానం ఆవల నేర్చుకున్న అన్ని పాఠాలనూ ఇప్పుడు ఉపయోగించాలి మరి!’ అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో సీఎస్‌కే ఒకటి. అందులోని సీనియర్‌ ఆటగాళ్లంతా 35 ఏళ్లు దాటినవారే. ఏటా టోర్నీ జరిగేటప్పుడు వారి డ్రస్సింగ్‌ రూమ్‌ భార్యా, పిల్లలతో కళకళలాడే సంగతి తెలిసిందే.

చెన్నై సీనియర్‌ ఆటగాడు సురేశ్‌ రైనా తన సహచరుడికి అభినందనలు తెలియజేశాడు. ‘చక్కని కుమార్తెకు జన్మనిచ్చినందుకు అంబటి రాయుడు, విద్యకు హృదయపూర్వక అభినందనలు. ఇదో అద్భుత ఆశీర్వాదం! ఆ చిట్టితల్లితో ప్రతి నిమిషం, సందర్భాన్ని ఆనందించండి. మీరెప్పుడూ ప్రేమ, సంతోషంతో గడపాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశాడు. 2019 ప్రపంచకప్‌నకు ఎంపికకాని రాయుడు ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఐపీఎల్‌లో తన సత్తా నిరూపించుకుందామని తహతహలాడుతున్నప్పటికీ కరోనా కారణంగా టోర్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని