భువనేశ్వర్‌ తొలి సంపాదన ఎంతో తెలుసా?
close
Published : 14/07/2020 12:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భువనేశ్వర్‌ తొలి సంపాదన ఎంతో తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఇప్పుడైతే కోట్లలో సంపాదిస్తున్నాడు కానీ ఒకప్పుడు అందరి క్రికెటర్ల లాగే అవకాశాల కోసం ఎదురు చూశాడు. తాజాగా ఓ నెటిజన్‌ అతడి తొలి సంపాదన ఎంత అని అడగ్గా భారత పేసర్‌ స్పందించాడు. తన తొలి సంపాదన రూ.3000 అని, అందులో కొంచెం షాపింగ్‌ చేయగా, మరి కొంత డబ్బును పొదుపు చేశానని గుర్తుచేసుకున్నాడు.  

2012 డిసెంబర్‌లో టీమ్‌ఇండియాలో అడుగుపెట్టిన ఈ పేస్‌ బౌలర్‌ పాకిస్థాన్‌తో తొలి టీ20 ఆడాడు. ఆ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరోవైపు రంజీల్లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను డకౌట్‌ చేసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అనంతరం జట్టులో మంచి బౌలర్‌గా పేరుతెచ్చుకున్న భువి 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇక అదే ఏడాది ట్రైనేషన్‌ సిరీస్‌లో శ్రీలంకపై 4/8 అత్యుత్తమ గణంకాలు నమోదు చేశాడు. గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో చివరి టీ20 ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌, శ్రీలంకతో పొట్టి సిరీస్‌ ఆడలేదు. కాగా, ఈ ఏడాదికి బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్టులో భువనేశ్వర్‌ ఏ గ్రేడ్‌లో ఉన్నాడు. దీంతో అతడి వార్షిక ఆదాయం రూ.5 కోట్లుగా తేలింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని