భారత్‌-పాక్‌ క్రికెట్‌ ప్రపంచ క్రికెట్‌కు మంచిది..
close
Published : 15/07/2020 02:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌-పాక్‌ క్రికెట్‌ ప్రపంచ క్రికెట్‌కు మంచిది..

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-పాకిస్థాన్ దాయాది జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగితే అది ప్రపంచ క్రికెట్‌కు మంచిదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ ఎహ్‌సన్‌ మణి అభిప్రాయపడ్డాడు. 2013 జనవరిలో పాక్‌ జట్టు భారత్‌లో కొచ్ రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచీ ఇరు జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. కేవలం ఐసీసీ, లేదా ఆసియా కప్‌ల సందర్భంగానే తలపడుతున్నాయి. ఇక 2007-2008 సీజన్‌లో ఇరు జట్లూ చివరి సారి టెస్టు సిరీస్‌ ఆడాయి. తాజాగా క్రిక్‌బజ్‌తో మాట్లాడిన మణి ఇలా స్పందించాడు.

‘భారత్‌-పాక్ మ్యాచ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఈ మ్యాచ్‌లకు అత్యధిక వీక్షకులు ఉంటారు. ఐసీసీ లేదా ఏసీసీ ఈవెంట్లలో తప్ప ఇరు జట్లూ ద్వైపాక్షిక క్రికెట్‌ ఆడటం లేదు.  దాయాది జట్లు తలపడితే అది ప్రపంచ క్రికెట్‌కు చాలా మంచిది. అయితే, మేం మాత్రం భారత్‌తో ఆడాలనే ప్రణాళికలు రూపొందించడం లేదు. అలాగే కొన్ని బోర్డులు తమ తాత్కాలిక ఉద్దేశాలను పక్కనపెట్టి ఆట మంచి కోసం కృషిచేయాలి’ అని ఆయన అన్నాడు. ఇదిలా ఉండగా, ఇంతకుముందే పాక్‌ దిగ్గజ బౌలర్లు వకార్‌ యూనిస్‌, షోయబ్‌ అక్తర్‌ సైతం ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌ జరగాలని ఆకాంక్షించారు. అక్తర్‌ ఏకంగా కరోనా బాధితుల కోసం భారత్‌-పాక్‌ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల ఛారిటి సిరీస్‌ నిర్వహించాలని చెప్పాడు. దాన్ని భారత దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని