కెరీర్‌పై భయంతో పుజారా ఏడ్చిన వేళ.. 
close
Updated : 08/05/2021 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కెరీర్‌పై భయంతో పుజారా ఏడ్చిన వేళ.. 

ముంబయి: భారత టెస్టు జట్టులో అత్యంత విలువైన ఆటగాళ్లలో చెతేశ్వర్‌ పుజారా ఒకడు. గంటలు గంటలు క్రీజులో నిలిచే పుజారా మానసిక దృఢత్వం గురించి తరచుగా చర్చ జరుగుతుంటుంది. అలాంటి పుజారా ఒకప్పుడు కెరీర్‌ పట్ల తీవ్ర ఆందోళనతో ఏడ్చాడట. పూర్తి ప్రతికూల ఆలోచనలతో మానసిక వేదనకు గురయ్యాడట. తాను క్రికెట్లో కొనసాగలేనేమో అని భయపడ్డాడట. ఓ ఇంటర్వ్యూలో ఆ రోజులను అతను గుర్తు చేసుకున్నాడు. ‘‘కెరీర్‌ ఆరంభంలో నాకు తొలిసారి పెద్ద గాయం అయింది. అది నా కెరీర్లోనే అత్యంత కఠిన సమయం. జట్టు ఫిజియో నా దగ్గరికొచ్చి కోలుకోవడానికి ఆరు నెలల దాకా సమయం పట్టొచ్చన్నాడు. నేను తీవ్ర నిరాశకు గురై ఏడ్చేశాను. అప్పుడు నా ఆలోచనలన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. మళ్లీ క్రికెట్ ఆడగలనా.. అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగగలనా అని సందేహాలు కలిగాయి’’ అని పుజారా చెప్పాడు. ఈ దశ నుంచి ఎలా కోలుకున్నది వివరిస్తూ.. ‘‘తర్వాత నెమ్మదిగా నా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాట్లాడుతుంటే నాలో ధైర్యం వచ్చింది. అంతా సర్దుకుంటుందని వాళ్లు ధైర్యం చెప్పారు. భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి వర్తమానం మీద దృష్టి పెట్టా. అదే సమయంలో యోగా, ధ్యానం చేయడంతో మళ్లీ సానుకూల ఆలోచనల్లోకి వచ్చా’’ అని పుజారా తెలిపాడు. ఒకప్పుడు ఒత్తిడిని తట్టుకోలేక అమ్మ దగ్గరికెళ్లి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని, కానీ తర్వాత నెమ్మదిగా ఒత్తిడిని అధిగమించడం అలవాటైందని చెతేశ్వర్‌ చెప్పాడు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని