WTC Final: కోహ్లీసేన ఏకైక ‘ఇబ్బంది’ అదే
close
Published : 10/06/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WTC Final: కోహ్లీసేన ఏకైక ‘ఇబ్బంది’ అదే

మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కీలకమన్న వెంగ్‌ సర్కార్‌

ముంబయి: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముందు టీమ్‌ఇండియాకు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడం కాస్త ఇబ్బందికరమేనని మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అన్నారు. ముందుగానే ఇంగ్లాండ్‌ పరిస్థితులకు అలవాటు పడటం కీలకమని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌ అక్కడ ముందుగానే రెండు టెస్టులు ఆడటం వారికి ప్రయోజనకరమని వెల్లడించారు. ఏదేమైనా కోహ్లీసేనలో పోరాట పటిమ దాగుందని వివరించారు. ఆస్ట్రేలియా పర్యటనలో మనం దానిని చూశామని గుర్తుచేశారు.

‘ఫైనల్‌కు ముందు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడం కాస్త ఇబ్బందికరమేనని నా అభిప్రాయం. నాకు గుర్తున్న మేరకు ఆస్ట్రేలియా సిరీసుకు ముందు టీమ్‌ఇండియా కొన్ని సన్నాహక మ్యాచులు ఆడింది. అడిలైడ్‌లో 36కే ఆలౌటైనా, సీనియర్లు గాయపడ్డా భారత్‌ టైటిల్‌ గెలిచింది. టెస్టు సిరీసులో ఆడకముందే క్రికెటర్లు పరిస్థితులకు అలవాటు పడ్డారు. ఆసీస్‌పై సిరీస్‌ విజయం అద్భుతం. జట్టు తన పోరాట పటిమను ప్రదర్శించింది. భారత క్రికెట్లో ఎలాంటి ప్రతిభావంతులు ఉన్నారో ఆస్ట్రేలియా పర్యటన ప్రపంచానికి చూపించింది’ అని వెంగీ అన్నారు.

‘ఏదేమైనా సన్నాహక మ్యాచులు ఆడటం, మధ్యలో నిలవడం ముఖ్యం. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ను మించిందేం లేదు. మనం నెట్స్‌లో సాధన చేసుండొచ్చు. కానీ మ్యాచ్‌ పరిస్థితుల్లో నిలవడం భారీ మ్యాచుల్లో ఉపయోగకరం. బ్యాటర్లకే కాదు బౌలర్లకూ సన్నాహకం కీలకమే. ముఖ్యంగా ఇంగ్లాండ్‌ వంటి దేశంలో ఎక్కడ బంతులు విసరాలో వారికి అర్థమవుతుంది’ అని వెంగీ తెలిపారు.

ప్రస్తుతం భారత్‌ మెరుగైన జట్టని, గొప్ప ఫామ్‌లో ఉందని వెంగీ ప్రశంసించారు. న్యూజిలాండ్‌పై అంచనాలు తక్కువగా ఉండటం వారికి కలిసొచ్చే మరో అంశంగా పేర్కొన్నారు. ఫైనల్‌కు ముందే ఇంగ్లాండ్‌తో వారు రెండు టెస్టులు ఆడటం వల్ల పరిస్థితులపై వారికి అవగాహన వస్తుందని వెల్లడించారు. జూన్‌ 18న సౌథాంప్టన్‌ వేదికగా భారత్‌, కివీస్‌ ఫైనల్లో తలపడుతున్న సంగతి తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని