భయం భయం
close
Updated : 08/04/2021 09:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భయం భయం

కంగారెత్తిస్తున్న కరోనా
బబుల్‌లోనూ కేసులు
ఆర్‌సీబీ బౌలర్‌ సామ్స్‌కు పాజిటివ్‌
ఐపీఎల్‌ నిర్వాహకుల్లో ఆందోళన

చెన్నై

కరోనా పరిస్థితుల్లోనూ యూఏఈలో 2020 ఐపీఎల్‌ను బీసీసీఐ    విజయవంతంగా నిర్వహించింది. అయితే ఉధృతి తగ్గడంతో భారత్‌లోనే 2021 ఐపీఎల్‌కు ఏర్పాట్లు చేసుకున్న బోర్డును కొవిడ్‌-19 భయపెడుతోంది. శుక్రవారం టోర్నీ ప్రారంభం కావాల్సివుండగా బయో బబుల్‌లోనూ పాజిటివ్‌ కేసులు రావడంతో మ్యాచ్‌ల నిర్వహణ పెను సవాలుగా మారబోతోంది.

రోనా మహమ్మారి బీసీసీఐకి చెమటలు పట్టిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆందోళనైతే తప్పట్లేదు. 2021 ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌కు సిద్దమవుతున్న క్రమంలో కొద్ది మంది ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, ప్రసార సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వీళ్లంతా ఇంకా బయో బబుల్‌లో అడుగుపెట్టని వాళ్లే. తాజాగా బయో బబుల్‌లో ఉన్న వాళ్లకూ కరోనా సోకడంతో అసలు టోర్నీ సవ్యంగా సాగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మంగళవారం ముంబయి ఇండియన్స్‌ వికెట్‌కీపింగ్‌ సలహాదారు కిరణ్‌ మోరె పాజిటివ్‌గా తేలాడు. బబుల్‌లో ఉన్న మిగతా అందరికీ నెగెటివ్‌ రావడం డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు ఊరట కలిగించే అంశమే అయినా.. ముందు ముందు ఏం జరుగుతుందో అన్న ఆందోళన మాత్రం ఉంది. వాంఖడే స్టేడియంలో ఇంతకుముందు అనేక మంది ప్రసార సిబ్బంది.. అక్షర్‌ పటేల్‌, నితీష్‌ రాణా సహా కొందరు క్రికెటర్లు కరోనా వైరస్‌ బారిన పడ్డ సంగతి తెలిసిందే.
బెంగళూరుకు షాక్‌
కరోనా నుంచి కోలుకున్న ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ బుధవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో చేరాడు. కోహ్లీసేనకు అది ఎంతో ఊరటనిచ్చే విషయమే. కానీ అదే రోజు ఆ జట్టుకు పెద్ద షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ డేనియల్‌ సామ్స్‌ పాజిటివ్‌గా తేలాడు. ఏప్రిల్‌ 3న భారత్‌కు వచ్చిన సామ్స్‌కు ఆ రోజు నెగెటివ్‌ వచ్చిందని, 7న చేసిన రెండో పరీక్షలో పాజిటివ్‌ వచ్చిందని బెంగళూరులో ఓ ప్రకటనలో తెలిపింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో బెంగళూరు శుక్రవారం ముంబయి ఇండియన్స్‌ను ఢీకొంటుంది. ‘‘ఏప్రిల్‌ 7న సామ్స్‌కు నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. అతడిలో ఎలాంటి లక్షణాలూ లేవు. అతడిప్పుడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. బెంగళూరు వైద్య సిబ్బంది డేనియల్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అతడి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు’’ అని ఆర్సీబీ చెప్పింది. బెంగళూరు సామ్స్‌ను ఈ ఏడాది దిల్లీ క్యాపిటల్స్‌ నుంచి తీసుకుంది. పడిక్కల్‌ తర్వాత కొవిడ్‌ బారినపడ్డ రెండో బెంగళూరు ఆటగాడతడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో 20 ఏళ్ల పడిక్కల్‌ జట్టుతో చేరిపోయాడు. అతడు మార్చి 22 నుంచి ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. పడిక్కల్‌ గత సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 473 పరుగులతో ఆర్సీబీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ‘‘బీసీసీఐ నిబంధనల ప్రకారం నెగెటివ్‌ ఫలితంతో పడిక్కల్‌ ఏప్రిల్‌ 7న జట్టుతో చేరాడు’’ అని బెంగళూరు తెలిపాడు. ఇక సామ్స్‌ ఇప్పటివరకు మూడు ఐపీఎల్‌ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గత సీజన్‌లో అతడు ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని