కుర్రాళ్లు బ్యాట్లెత్తేశారు
close
Published : 30/07/2021 02:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుర్రాళ్లు బ్యాట్లెత్తేశారు

మూడో టీ20లోనూ భారత్‌ ఓటమి
విజృంభించిన హసరంగ
సిరీస్‌ 2-1తో శ్రీలంక వశం

కొలంబో: బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన టీమ్‌ఇండియా నిర్ణయాత్మక టీ20లో బోల్తా కొట్టింది. స్పిన్‌తో భారత్‌ను దెబ్బతీసిన ఆతిథ్య శ్రీలంక ఏకపక్షంగా సాగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో గెలిచి, 2-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. లెగ్‌స్పిన్నర్‌ వనిందు హసరంగ (4/9) బౌలింగ్‌కు ఉక్కిరిబిక్కిరైన భారత్‌.. మొదట 8 వికెట్లకు 81 పరుగులే చేయగలిగింది. కుల్‌దీప్‌ యాదవ్‌ (23 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. లక్ష్యాన్ని శ్రీలంక 14.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ధనంజయ డిసిల్వా (23 నాటౌట్‌) రాణించాడు. రాహుల్‌ చాహర్‌ (3/15) చక్కగా బౌలింగ్‌ చేసినా.. అతడి ప్రయత్నం సరిపోలేదు.

భారత్‌ టపటపా..: భారత జట్టు బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు దక్కించుకున్న యువ బ్యాట్స్‌మెన్‌ నిరాశపరిచారు. పేలవ ఫుట్‌వర్క్‌తో స్పిన్‌ బౌలింగ్‌లో తేలిపోయారు. ఫ్రంట్‌ఫుట్‌పై ఆడాలా లేదా బ్యాక్‌ఫుట్‌పై ఆడాలా అన్న సంశయం కారణంగా దెబ్బతిన్నారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు తొలి ఓవర్లోనే షాక్‌ తగిలింది. ధావన్‌ ఖాతా తెరవకుండానే చమీర బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అక్కడి నుంచి ఏ దశలోనూ భారత్‌ పతనం ఆగలేదు. హసరంగ తన స్పిన్‌తో మాయ చేశాడు.. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (9), సంజు శాంసన్‌ (0), రుతురాజ్‌ గైక్వాడ్‌ (14), నితీష్‌ రాణా (6) పేలవ బ్యాటింగ్‌తో పెవిలియన్‌కు క్యూకట్టడంతో భారత్‌ 36/5తో నిలిచింది. కుల్‌దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ (16) రాణించకపోతే భారత్‌ ఆ మాత్రం స్కోరైనా సాధించేది కాదు. వీళ్లిద్దరు కాకుండా రుతురాజ్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు ఫోర్లు మాత్రమే ఉన్నాయంటే.. లంక బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఫీల్డింగ్‌లోనూ మెరిసిన లంకేయులు చక్కని క్యాచ్‌లు అందుకున్నారు. టీ20 క్రికెట్లో భారత్‌ అత్యల్ప స్కోరు 74 (2008లో ఆస్ట్రేలియాపై) పరుగులు. ఈ మ్యాచ్‌తో ఫాస్ట్‌బౌలర్‌ సందీప్‌ వారియర్‌ భారత్‌ తరఫున టీ20 అరంగేట్రం చేశాడు.


భారత్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ ఎల్బీ (బి) హసరంగ 14; ధావన్‌ (సి) ధనంజయ డిసిల్వా (బి) చమీర 0; పడిక్కల్‌ ఎల్బీ (బి) మెండిస్‌ 9; సంజు శాంసన్‌ ఎల్బీ (బి) హసరంగ 0; నితీష్‌ రాణా (సి) అండ్‌ (బి) శనక 6; భువనేశ్వర్‌ కుమార్‌ (సి) శనక (బి) హసరంగ 16; కుల్‌దీప్‌ యాదవ్‌ నాటౌట్‌ 23; రాహుల్‌ చాహర్‌ (సి) మినోద్‌ (బి) శనక 5; వరుణ్‌ చక్రవర్తి (సి) కరుణరత్నె (బి) హసరంగ 0; సకారియా నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 81;

వికెట్ల పతనం: 1-5, 2-23, 3-24, 4-25, 5-36, 6-55, 7-62, 8-63

బౌలింగ్‌: చమీర 4-0-16-1; చమిక కరుణరత్నె 2-0-12-0; రమేశ్‌ మెండిస్‌ 2-0-13-1; హసరంగ 4-0-9-4;  అకిల ధనంజయ 4-0-11-0; శనక 4-0-20-2

శ్రీలంక ఇన్నింగ్స్‌: అవిష్క (సి) అండ్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 12; మినోద్‌ ఎల్బీ (బి) రాహుల్‌ చాహర్‌ 18; సమరవిక్రమ (బి) రాహుల్‌ చాహర్‌ 6; ధనంజయ డిసిల్వా నాటౌట్‌ 23; హసరంగ నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (14.3 ఓవర్లలో 3 వికెట్లకు) 82

వికెట్ల పతనం: 1-23, 2-35, 3-56

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2-0-9-0; వరుణ్‌ చక్రవర్తి 3.3-0-15-0; సందీప్‌ వారియర్‌ 3-0-23-0; రాహుల్‌ చాహర్‌ 4-0-15-3; కుల్‌దీప్‌ యాదవ్‌ 2-0-16-0


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని