భారత్‌ సెమీస్‌ చేరేనా..
close
Published : 01/08/2021 02:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌ సెమీస్‌ చేరేనా..

హాకీ క్వార్టర్స్‌లో నేడు బ్రిటన్‌తో ఢీ

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. 41 ఏళ్ల విరామం తర్వాత ఈసారైనా సెమీఫైనల్‌ చేరాలని తహతహలాడుతున్న భారత్‌.. ఆదివారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో బ్రిటన్‌ను ఢీకొంటుంది. అసాధారణ రీతిలో ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు గెలిచిన భారత్‌.. చివరిసారి 1980లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు మరో పతకం గెలవలేదు. ప్రదర్శన క్షీణిస్తూ వచ్చింది. 1984లో సాధించిన అయిదో స్థానమే.. 1980 తర్వాత ఒలింపిక్స్‌లో భారత్‌కు అత్యుత్తమ   ప్రదర్శన. 2008 ఒలింపిక్స్‌కు కనీసం అర్హత కూడా సాధించలేకపోయింది. 2016 (రియో) ఒలింపిక్స్‌లో అట్టడుగున నిలిచింది. అయితే గత అయిదేళ్లలో మెరుగుపడ్డ భారత్‌.. టోక్యోలో పతకంపై ఆశతో ఉంది. ఆస్ట్రేలియా చేతిలో 1-7తో ఓటమి మినహా.. మెరుగైన ప్రదర్శనే చేసింది. అయిదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పూల్‌-ఎలో రెండో స్థానంతో భారత్‌ క్వార్టర్‌ఫైనల్‌ చేరింది. మరోవైపు బ్రిటన్‌ రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో పూల్‌-బిలో మూడో స్థానంలో నిలిచింది. రాం్యకింగ్స్‌లో భారత్‌ మూడో స్థానంలో, బ్రిటన్‌ అయిదో స్థానంలో ఉన్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని