బైల్స్‌.. మరో రెండు
close
Published : 01/08/2021 03:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బైల్స్‌.. మరో రెండు

వాల్ట్‌, అన్‌ ఈవెన్‌ బార్స్‌కూ దూరం

టోక్యో: అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ తన అభిమానుల్ని మరోసారి తీవ్ర నిరాశకు గురి చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగి, టీమ్‌ ఈవెంట్‌తో కలిపి ఆరు స్వర్ణాలపై కన్నేసిన ఆమె.. అన్నింట్లోనూ ఫైనల్స్‌కు అర్హత సాధించాక, అసలు పోటీల నుంచి వరుసగా వైదొలుగుతూ షాకిస్తోంది. మానసిక సమస్యలతో ఇప్పటికే టీమ్‌ ఈవెంట్‌, వ్యక్తిగత ఆల్‌రౌండ్‌ ఈవెంట్‌ ఫైనల్స్‌ నుంచి తప్పుకున్న ఆమె.. తాజాగా వాల్ట్‌, అన్‌ ఈవెన్‌ బార్స్‌ ఫైనల్స్‌కు దూరమైంది. టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్‌ మధ్యలో బైల్స్‌ వైదొలిగాక అయిదు రోజుల విరామం తర్వాత.. ఆదివారం వాల్ట్‌, అన్‌ ఈవెన్‌ బార్స్‌ ఫైనల్స్‌ జరగనుండటంతో ఆమె కోలుకుని ఉంటుందని, ఇందులో పోటీ పడుతుందని అభిమానులు ఆశించారు. కానీ తాను వాల్ట్‌లోనూ టైటిల్‌ నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగట్లేదని ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఒక రోజు ముందే ప్రకటించింది. జిమ్నాస్టిక్స్‌ పోటీల మధ్యలో క్రీడాకారులు గాల్లో ఉన్నపుడు ఒకట్రెండు క్షణాల పాటు శూన్యం ఆవహించి ఏం చేయాలో తెలియని స్థితికి చేరుకునే ‘ట్విస్టీస్‌’ అనే సమస్యతో బైల్స్‌ బాధ పడుతోంది. మరి మిగతా రెండు వ్యక్తిగత ఈవెంట్ల ఫైనల్స్‌లో అయినా బైల్స్‌ పోటీ పడుతుందో లేదో చూడాలి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని