జకోకు కాంస్యమూ దక్కలేదు
close
Published : 01/08/2021 03:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జకోకు కాంస్యమూ దక్కలేదు

టోక్యో: స్వర్ణమే లక్ష్యంగా ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా).. కనీసం కాంస్యం కూడా గెలవకుండా క్రీడల నుంచి నిష్క్రమించాడు. శనివారం కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో అతడు 4-6, 7-6 (6), 3-6తో స్పెయిన్‌కు చెందిన పాబ్లో బుస్టా చేతిలో ఓడిపోయాడు. మ్యాచ్‌ సందర్భంగా తీవ్ర అసహనానికి గురైన జకోవిచ్‌.. పలుమార్లు రాకెట్‌ను విసిరికొట్టాడు. ఈ ఒలింపిక్స్‌లో జకోవిచ్‌కు ఇది మూడో ఓటమి. సెమీస్‌లో అతడు జ్వెరెవ్‌ చేతిలో పరాజయంపాలైన సంగతి తెలిసిందే. నినా స్టొజనోవిచ్‌తో కలిసి అతడు మిక్స్‌డ్‌ సెమీస్‌లోనూ ఓడిపోయాడు. ‘‘నేను నిన్న, ఈ రోజు బాగా ఆడలేకపోయాను. మానసికంగా, శారీరకంగా అలసిపోవడం వల్ల కూడా నా ప్రదర్శన పడిపోయింది’’ అని బుస్టాతో మ్యాచ్‌ అనంతరం జకోవిచ్‌ వ్యాఖ్యానించాడు. శనివారం అతడు నినా స్టొజనోవిచ్‌తో కలిసి మిక్స్‌డ్‌ కాంస్య పతక మ్యాచ్‌లో కూడా ఆడాల్సింది. కానీ ఎడమ భుజం గాయంతో అతడు వైదొలిగాడు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని