పోలెండ్‌ ఖాతాలో మిక్స్‌డ్‌ టైటిల్‌
close
Updated : 01/08/2021 04:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలెండ్‌ ఖాతాలో మిక్స్‌డ్‌ టైటిల్‌

టోక్యో: రిలే పరుగు అనగానే మొదట జమైకా గుర్తొస్తుంది.. లేదంటే అమెరికా పేరు ప్రస్తావనకు వస్తుంది. ఒలింపిక్స్‌ అయినా ప్రపంచ ఛాంపియన్‌సిప్‌ అయినా ఈ రెండు దేశాల అథ్లెట్ల గురించే ఎక్కువ చర్చ నడుస్తుంది. కానీ ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే పరుగులో పసిడి మాత్రం ఈ రెండు దేశాలకు దక్కలేదు. ఎవరూ ఊహించని విధంగా పోలెండ్‌ పసిడి పతకాన్ని తన్నుకుపోయింది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి.. ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన అమెరికా కనీసం రజతం కూడా దక్కించుకోలేకపోయింది. మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది. కరోల్‌ జలేస్కి, నటాలియా కజ్మారెక్‌, జస్టినా స్వీటీ-ఎర్సెటిచ్‌, కజెతన్‌ దుసున్‌స్కీతో కూడిన పోలెండ్‌ జట్టు.. 3 నిమిషాల 9.87 సెకన్లలో రేసును పూర్తి చేసి అమెరికాకు షాకిచ్చింది. జట్టు సభ్యులందరికీ ఇదే తొలి ఒలింపిక్‌ పతకం. అమెరికా స్టార్‌ అథ్లెట్‌ అలిసన్‌ ఫెలిక్స్‌ ఈ రేసు బరిలో దిగలేదు. జమైకాకు పతకమే దక్కలేదు. ఆ జట్టు ఫైనల్లో ఏడో స్థానంలో నిలిచింది. డొమినికన్‌ రిపబ్లిక్‌ రజతం గెలిచింది. ఒలింపిక్స్‌లో 4×400 మీటర్ల రేసు నిర్వహించడం ఇదే తొలిసారి.

తొలి పసిడి బ్రిటన్‌దే

టోక్యో: ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన ట్రయథ్లాన్‌ మిక్స్‌డ్‌ రిలే స్వర్ణాన్ని బ్రిటన్‌ సొంతం చేసుకుంది. గంటా 23 నిమిషాల 41 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న ఆ దేశం అగ్రస్థానంలో నిలిచింది. జెస్సికా, జోనాథన్‌, జార్జియా, అలెక్స్‌లతో కూడిన బృందం.. 300మీ. స్విమ్మింగ్‌, 6.8 కిలోమీటర్ల సైక్లింగ్‌, 2 కిలోమీటర్ల పరుగును మిగతా దేశాల అథ్లెట్ల కంటే ముందుగానే పూర్తిచేసింది. అమెరికా (1:23:55సె), ఫ్రాన్స్‌ (1:24.04సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని