జూడోలో జపాన్‌ హవా
close
Published : 01/08/2021 03:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జూడోలో జపాన్‌ హవా

టోక్యో: ఎన్నో సవాళ్ల మధ్య ఒలింపిక్స్‌ను నిర్వహిస్తున్న జపాన్‌.. పోటీల్లోనూ గొప్పగా రాణిస్తోంది. టోక్యో క్రీడలు జపాన్‌కు ఇప్పటికే అత్యుత్తమ ఒలింపిక్స్‌గా నిలిచిపోయాయి. ముఖ్యంగా జూడో ఆ దేశానికి పతకాల పంట పండిస్తోంది. ఈ ఆటలో అందుబాటులో ఉన్న 15 స్వర్ణాల్లో జపానే 9 సాధించింది. మొత్తంగా జూడోలో 12 పతకాలు గెలుచుకుంది. 2020 క్రీడల్లో ఇప్పటివరకు 17 స్వర్ణాలు గెలిచిన జపాన్‌.. ఒలింపిక్స్‌ చరిత్రలోనే తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. 1964 (టోక్యో), 2004 (ఏథెన్స్‌) ఒలింపిక్స్‌ల్లో జపాన్‌ గరిష్టంగా 16 స్వర్ణాలు గెలుచుకుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని