ఆసీస్‌ మహిళల జైత్రయాత్రకు తెర
close
Published : 27/09/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసీస్‌ మహిళల జైత్రయాత్రకు తెర

మూడో వన్డేలో భారత్‌ విజయం

మెకాయ్‌ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా మహిళల జట్టు జైత్రయాత్రకు భారత్‌ తెరదించింది. యువ బ్యాటర్లు యస్తిక భాటియా (64; 69 బంతుల్లో 9×4), షెఫాలీ వర్మ (56; 91 బంతుల్లో 7×4) అర్ధశతకాలతో రాణించడంతో ఆదివారం నామమాత్రమైన మూడో వన్డేలో భారత్‌ 2 వికెట్ల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది. ఆష్లీ గార్డ్‌నర్‌ (67), బెత్‌ మూనీ (52), తహిలా మెక్‌గ్రాత్‌ (47) రాణించడంతో మొదట ఆస్ట్రేలియా 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జులన్‌ (3/37), పూజ (3/46) బంతితో రాణించారు. యస్తిక, షెఫాలీతో పాటు దీప్తి శర్మ (31), స్నేహ్‌ రైనా (30) రాణించడంతో లక్ష్యాన్ని భారత్‌.. 49.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత మహిళల జట్టుకు వన్డేల్లో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. ఈ ఫలితంతో 26 వన్డేల పాటు ఓటమి లేకుండా సాగిన ఆసీస్‌ జోరుకు బ్రేక్‌ పడింది. తొలి రెండు వన్డేల్లో నెగ్గిన ఆ జట్టు 2-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. రెండు జట్ల మధ్య ఏకైక టెస్టు 30న ఆరంభమవుతుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని