రాజధానిపై తక్షణమే ప్రకటన చేయాలి:పవన్‌
close
Published : 03/01/2020 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజధానిపై తక్షణమే ప్రకటన చేయాలి:పవన్‌

అమరావతి: రాజధానిపై కాలయాపన చేయడం తగదని.. ప్రభుత్వం తక్షణమే అధికారిక ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఈ అంశంలో వైకాపా నాయకుల ప్రకటనలు ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆరోపించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ పదేపదే చెబుతున్నారని.. అధికారం మీచేతిలోనే ఉన్నప్పుడు చర్యలు తీసుకోవచ్చు కదా అని పవన్‌ ప్రశ్నించారు. అప్పట్లో అమరావతిని సీఎం జగన్‌ అంగీకారం తెలిపారని.. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారని విమర్శించారు. ఇప్పుడు పెట్టే రాజధాని అయినా అందరి ఆమోదంతో నిర్ణయించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. పాలకుల నిర్ణయాలతో అమరావతి త్రిశంకు స్వర్గంలా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని