వాళ్లని ‘దేశ వ్యతిరేకులు’ అనలేదు: అమిత్‌ షా
close
Published : 03/01/2020 15:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లని ‘దేశ వ్యతిరేకులు’ అనలేదు: అమిత్‌ షా

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో నిర్బంధంలో ఉన్న నేతలెవరినీ ప్రభుత్వం ‘దేశ వ్యతిరేకులు’గా అభివర్ణించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. వారి విడుదలపై అక్కడి స్థానిక ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని ఉద్ఘాటించారు. ఫరూఖ్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా గతంలో ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కారణంగానే వారిని కొన్ని రోజుల పాటు నిర్బంధించాల్సి వచ్చిందని వివరించారు. ‘‘ఒకవేళ అధికరణ 370ని కదిపితే దేశం మొత్తం అగ్గి రాజుకుంటుందన్న వారి వ్యాఖ్యల్ని ఒకసారి గమనించండి. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్లపాటు వారిని నిర్బంధించాలన్న నిర్ణయం తీసుకున్నాం’’ అని ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో అమిత్‌ షా అన్నారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని తెలిపారు. కశ్మీర్‌లో ఇప్పుడు ఎక్కడా కర్ఫ్యూ విధించలేదన్నారు. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయన్నారు.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించిన అధికరణ 370 రద్దు నేపథ్యంలో.. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు ప్రముఖుల్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్‌ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీని నిర్బంధంలో ఉంచారు. ఫరూఖ్‌ని కఠినమైన ‘ప్రజా భద్రత చట్టం’ కింద గృహ నిర్బంధంలో ఉంచడం గమనార్హం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని