‘జనసేన’ ఇన్‌ఛార్జ్‌లను నియమించిన పవన్‌
close
Published : 07/01/2020 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జనసేన’ ఇన్‌ఛార్జ్‌లను నియమించిన పవన్‌

అమరావతి: రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో ఈ నియామకాలు చేపట్టారు. విశాఖ పార్లమెంట్‌ స్థానానికి మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, పి.గంగులయ్య (అరకు), పంతం నానాజీ (కాకినాడ), డీఎంఆర్‌ శేఖర్‌ (అమలాపురం), కందుల దుర్గేష్‌ (రాజమహేంద్రవరం), బోనబోయిన శ్రీనివాసయాదవ్‌ (గుంటూరు)లతో పాటు 35 అసెంబ్లీ నియోజకవర్గాలను ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. వీరిలో ఎక్కువ మంది గత ఎన్నికల్లో పోటీ చేసిన వారే కావడం గమనార్హం. జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను రాజోలు ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయానికి ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో టి.శివశంకర్‌, మేడా గురుదత్‌, సుజాత పండా, బొమ్మిడి నాయకర్‌, వై.శ్రీనివాస్‌లను సభ్యులుగా నియమించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేయనుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని