అనుకున్న సమయానికే పోలవరం పూర్తవ్వాలి
close
Published : 07/01/2020 22:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుకున్న సమయానికే పోలవరం పూర్తవ్వాలి

అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి: ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు పోలవరం అని.. అనుకున్న సమయానికి దాన్ని పూర్తిచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జలవనరులశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పోలవరం పనుల ప్రగతిపై అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా అలసత్వానికి తావులేకుండా పనులు జరగాలని దిశానిర్దేశం చేశారు. విశాఖకు తాగునీటి సరఫరా కోసం పైపులైను వేసేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు వెళ్లే కాల్వల విస్తరణతో పాటు గోదావరి నీటిని బొల్లేపల్లి మీదుగా బనకచర్లకు తరలించే ప్రతిపాదనలను వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా సీఎం పలు సూచనలు చేశారు. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను కరవుపీడిత ప్రాంతాలకు తరలించాలని.. ఈ దిశగా చర్యలను వేగవంతం చేయాలని జగన్‌ ఆదేశించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని