కాకినాడ చేరుకున్న పవన్‌
close
Updated : 14/01/2020 17:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాకినాడ చేరుకున్న పవన్‌

కాకినాడ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కాకినాడ చేరుకున్నారు. తొలుత నగరంలోని గుడారిగంటలో జనసేన స్థానిక నేత పంతం నానాజీ ఇంటికి ఆయన చేరుకున్నారు. ఆదివారం జరిగిన వైకాపా కార్యకర్తల దాడి ఘటనలో గాయపడిన జనసేన నేతలు, కార్యకర్తలను నానాజీ నివాసంలో పవన్‌ పరామర్శించారు. ఘటన జరిగిన తీరును జనసేన కార్యకర్తలు తమ అధినేతకు వివరించారు. పవన్‌ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే కాకినాడ నగరంలో 144 సెక్షన్‌తో పాటు పోలీస్‌యాక్ట్‌ 30 అమలు చేస్తున్నారు. మరోవైపు స్థానిక వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దాడి ఘటన, ఆరోజు జరిగిన పరిణామాలపై తమ పార్టీ నేతలతో పవన్‌ చర్చిస్తున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడనున్నారు.

అంతకుముందు విశాఖ విమానాశ్రయం నుంచి పవన్‌ కాన్వాయ్‌ వెంట బయల్దేరిన పలువురు జనసేన నేతల వాహనాలను మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. తుని, ప్రత్తిపాడు కొందరు నేతలను అడ్డుకుని పరిమిత సంఖ్యలో వాహనాలనే పవన్‌ కాన్వాయ్‌ వెంట అనుమతించారు.

ఇదీ చదవండి..

                                

                                 

 


 





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని