అందుకే భాజపాతో పొత్తు: పవన్‌
close
Updated : 19/01/2020 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే భాజపాతో పొత్తు: పవన్‌

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయంలో అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లోని పార్టీ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో పవన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలు, దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భాజపాతో పొత్తు కుదుర్చుకున్నామని చెప్పారు. భాజపా అగ్ర నాయకత్వంతో గతంలో పలుమార్లు చర్చలు జరిగాయని పవన్‌ తెలిపారు. పొత్తు విషయంలో ఇరు పక్షాల నుంచి ఎలాంటి షరతులూ లేవని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల సమయంలోనే భాజపాతో కలసి పనిచేసినట్లు పవన్‌ గుర్తుచేశారు.

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలపై జనసేన కార్యకర్తలు పూర్తి అవగాహనతో ఉండాలని.. లేని పక్షంలో అపోహలకు గురయ్యే ప్రమాదం ఉందని పవన్‌ పేర్కొన్నారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సమయం తీసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకునే పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడుతున్నాయని పవన్‌ అన్నారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించాలని.. అర్హులైన పేర్లను కార్యకర్తలే సూచించాలన్నారు. ఇక నుంచి నెలలో కొన్ని రోజులపాటు తెలంగాణలో పార్టీ కార్యకలాపాల కోసం సమయాన్ని కేటాయిస్తానని కార్యకర్తలకు పవన్‌ హామీ ఇచ్చారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని