వైకాపాకు విశాఖపై ప్రేమలేదు: పవన్‌
close
Published : 20/01/2020 21:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైకాపాకు విశాఖపై ప్రేమలేదు: పవన్‌

మంగళగిరి: వైకాపా ప్రభుత్వానికి విశాఖపై ఏమాత్రం ప్రేమలేదని, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే విశాఖ పరిపాలన రాజధాని అంటోందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. గతంలో తెదేపా చేసిన తప్పులే ఇప్పుడు వైకాపా చేస్తోందన్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే విశాఖలో ఫ్యాక్షన్ పడగలు విప్పేలా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం నుంచి తనను అడుగు బయటపెట్టనివ్వకపోవడం దారుణమన్నారు. కాకినాడలో జనసేన పార్టీ కార్యకర్తలపై చేసిన దాడిని ఇంకా మర్చిపోలేదని ఆయన అన్నారు. అమరావతిని తరలించడం సాధ్యం కాదు.. ఐదు కోట్ల మంది ఆమోదించిన తర్వాత ఇప్పుడు తరలించాల్సిన అవసరమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనసేన పార్టీ స్టాండ్‌ను రాపాకకు చెప్పాం, అయినా ఆయన వైకాపా స్టాండ్ తీసుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. రాజధానుల నిర్ణయంతో వైకాపా వినాశనం మొదలైందని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని