‘రాజధాని మార్పునకు కేంద్రం సమ్మతి లేదు’
close
Updated : 22/01/2020 18:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రాజధాని మార్పునకు కేంద్రం సమ్మతి లేదు’

జనసేన అధినేత పవన్‌ స్పష్టీకరణ

దిల్లీ: ఏపీలో ప్రభుత్వాలు మారినా పనితీరు మారలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే అని ఆయన పునరుద్ఘాటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జనసేన-భాజపా బృందం భేటీ ముగిసింది. పవన్‌తో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌, పురందేశ్వరి, ఎంపీ జీవీఎల్‌, నాదెండ్ల మనోహర్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పవన్‌, కన్నా మీడియాతో మాట్లాడారు. నిర్మలా సీతారామన్‌తో ఏపీకి సంబంధించిన కీలకాంశాలతో పాటు రాజధాని ప్రస్తావనపైనా చర్చకు వచ్చిందని.. వివిధ అంశాలపై గంటసేపు చర్చించామని పవన్‌ చెప్పారు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై చర్చ జరిగిందని ఆయన వివరించారు.

తెదేపా హయాంలో కేంద్రం ఎలాంటి సహకారం అందించిందో ఇప్పుడూ అలానే అందిస్తోందని పవన్‌ చెప్పారు. గతంలో కేంద్రం ఇచ్చే నిధులపై యూసీలు ఇవ్వకుండా తెదేపా ఎలా వ్యవహరించిందో ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం కూడా అదే తీరుతో వెళ్తోందని.. ఆ ప్రస్తావన వచ్చిందన్నారు. ‘‘రాజధాని అమరావతికి సంబంధించి ఐదుకోట్ల మంది ప్రజలు, రైతులకు మాటిస్తున్నాం. అమరావతే శాశ్వత రాజధాని. రాజధానిపై బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ సాయంత్రం భాజపా-జనసేన ఉమ్మడి సమావేశంలో కార్యాచరణ నిర్ణయిస్తాం. ఈ అంశంలో ఎలా ముందుకెళ్తామనే విషయాన్ని వెల్లడిస్తాం. విశాఖలో రిపబ్లిక్‌ డే పరేడ్‌ అని చెప్పి మళ్లీ విజయవాడకు మార్చారు. దానికే అన్ని ఇబ్బందులు ఎదురైనపుడు రాజధాని తరలింపు సాధ్యమా?’’ అని ప్రశ్నించారు.

‘‘కేంద్రానికి చెప్పి రాజధాని మారుస్తున్నామని వైకాపా చెబుతోంది. మూడు రాజధానులకు ªకేంద్ర ప్రభుత్వ సమ్మతి లేదు. అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే. ఈ అంశంలో వారు కేంద్రంతో ఏమీ మాట్లాడలేదు. కేంద్రాన్ని భ్రష్టు పట్టించడానికే ఇలా చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం తీరు మారాలి. నిర్దిష్ట ప్రణాళికతో పాలన సాగించాలి. రాజధాని ఆందోళనల్లో రైతులు, మహిళలను విచక్షణా రహితంగా గాయపరిచారు’’ అని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని