విలీనంపై ప్రశ్న..పవన్‌ స్పందన ఏంటంటే..!
close
Updated : 22/01/2020 22:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విలీనంపై ప్రశ్న..పవన్‌ స్పందన ఏంటంటే..!

దిల్లీలో జనసేన- భాజపా సమన్వయ సమావేశం
కలిసే పనిచేయాలని ఇరు పార్టీల నిర్ణయం

దిల్లీ: ఏపీలో చేపట్టే ఏ కార్యక్రమం అయినా రెండు పార్టీలు కలిసే చేస్తాయని భాజపా-జనసేన నేతలు స్పష్టం చేశారు. దిల్లీలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు నివాసంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, నేతలు పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్‌ తదితరులు సమావేశమయ్యారు. భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యాచరణపై ఇరుపార్టీల నేతలు చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తొలుత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా మాట్లాడుతూ ఇరు పార్టీలకు ఇది తొలి సమన్వయ సమావేశమని చెప్పారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించుకుని రాజకీయ పరిస్థితులు, కార్యాచరణపై చర్చిస్తామన్నారు. రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీలు ప్రకటించిన తర్వాత తొలి సమావేశం 28 నిర్వహిస్తామని కన్నా తెలిపారు. 

అనంతరం జనసేన తరఫున నాదెండ్ల మనోహర్‌ మాట్లాడారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి విజయవాడ ఎగ్జిబిషన్‌ మైదానం వరకు లాంగ్‌మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. స్వలాభాన్ని పక్కన పెట్టి రెండు పార్టీలు పనిచేస్తాయన్నారు. రాష్ట్రంలోని పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నాయని మనోహర్‌ ఆరోపించారు. రాజకీయాలకే సమయాన్ని వెచ్చించి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఇకపై ఏ కార్యక్రమాలు చేపట్టినా రెండు పార్టీలు కలిసే నిర్వహిస్తాయని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఎంపీ జీవీఎల్‌ మాట్లాడుతూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గురువారం ఉదయం ఇరు పార్టీల నుంచి కలుస్తామని చెప్పారు. జాతీయ అధ్యక్షుడిగా ఆయన కొత్తగా ఎన్నికైనందున అభినందనలు తెలపడంతో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను వివరిస్తామన్నారు. రెండు పార్టీల నేతలతో నియమించే సమన్వయ కమిటీలో ఎవరెవరు ఉంటారనే విషయాలపై రేపు పత్రికా ప్రకటన విడుదల చేస్తామని జీవీఎల్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి విలీనం అంశాన్ని ప్రస్తావించగా పవన్‌ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అయోమయం సృష్టించొద్దని వారించారు. మీరు ఉద్దేశపూర్వకంగా అంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీనం అనే ప్రస్తావనే లేదని.. పొత్తుపై స్పష్టతతో ఉన్నామని పవన్‌ వ్యాఖ్యానించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని