కపిల్‌ మిశ్రాకు ఈసీ నోటీసులు
close
Updated : 24/01/2020 16:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కపిల్‌ మిశ్రాకు ఈసీ నోటీసులు

దిల్లీ: దిల్లీ ఎన్నికలను భారత్‌-పాకిస్థాన్‌ వివాదంతో పోల్చినందుకు గాను భాజపా నేత కపిల్‌ మిశ్రాకు దిల్లీ ఎన్నికల అధికారి షోకాజు నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై పూర్తి నివేదికను తమకు అందజేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం దిల్లీ ఎన్నికల అధికారిని ఆదేశించింది. 

‘ఫిబ్రవరి 8న దిల్లీ వీధుల్లో భారత్‌-పాకిస్థాన్‌ ఢీ కొంటున్నాయి’ అంటూ మిశ్రా నిన్న వివాదాస్పద ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం దానికి కొనసాగింపుగా మరో ట్వీట్‌ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన పౌరచట్టానికి వ్యతిరేకంగా షెహన్‌బాగ్‌ ప్రాంతంలో ఆందోళనల గురించి ప్రస్తావిస్తూ దాన్ని మినీ పాకిస్థాన్‌గా అభివర్ణించారు. పాక్‌ షెహన్‌బాగ్‌లోకి అడుగుపెట్టింది. దిల్లీలో ఆ ప్రాంతం మినీ పాకిస్థాన్‌గా మారింది. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏను షెహన్‌ బాగ్‌, ఛాంద్‌ బాగ్‌, ఇంద్రలోక్‌ వంటి ప్రాంతాల్లో అమల్లోకి తీసుకురానివ్వరు. దిల్లీలోని ఆ వీధులను పాక్‌ గూండాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయ్‌’ అంటూ వివాదాస్పద ట్వీట్‌ చేశారు. దిల్లీని పాక్‌తో పోల్చినందుకు గాను ఆయన నామినేషన్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని