మండలి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు: అంబటి
close
Updated : 25/01/2020 19:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మండలి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు: అంబటి

అమరావతి: వైఎస్సార్‌ విధానాలు పాటిస్తామన్నంత మాత్రాన ఆయన మాదిరిగా శాసనమండలిని కొనసాగించాల్సిన అవసరం లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. విచక్షణ మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శాసనమండలి రద్దు చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలి రద్దుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. శాసనమండలి ఉండొచ్చు.. ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు.

గతంలో వైఎస్సార్‌ మండలిని పునరుద్ధరిస్తే.. ఇప్పుడు ఆయన తనయుడు రద్దు చేస్తున్నారన్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. ఒక జాతీయ పార్టీకి వైఎస్సార్‌ సీఎంగా పనిచేశారని గుర్తుచేశారు. ఆ పార్టీ విధానాలకు అనుగుణంగా నడుచుకుని ఉండొచ్చన్నారు. వైఎస్సార్‌లా మండలి సాగించాల్సిన అవసరం లేదన్నారు. ఆయన పథకాలను, విధానాలను మాత్రం కొనసాగిస్తామన్నారు. రాజధాని మార్పు అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదే ఉద్ఘాటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని అంబటి అన్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని