మోదీది బలమైన నాయకత్వం: పవన్‌
close
Published : 27/01/2020 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీది బలమైన నాయకత్వం: పవన్‌

హైదరాబాద్‌: పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని.. సేవ చేయాలనే వచ్చానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. తాను మొదటి భారతీయుణ్ణి.. చివర కూడా భారతీయుణ్ణే అని వ్యాఖ్యానించారు. నెక్లెస్‌ రోడ్డులో భారతమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాహారతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై, అష్టావధాని గరికపాటి నరసింహారావు తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. ఎంతోమంది త్యాగఫలితమే మనం జరుపుకొనే ఈ సంబరాలని చెప్పారు. 

‘‘బలమైన నాయకత్వం ప్రధాని మోదీది. శత్రుదేశాలను గజగజ వణికే శక్తి ఆయనది. ప్రభావితం చేసే, దేశాన్ని రక్షించే నాయకత్వం కావాలి. అది భాజపాలో ఉంది. దేశ సేవలో కర్పూరంలా కరిగిపోవాలని ఉంది. దేశానికి సేవ చేయాలనే భాజపాతో కలిశా. పాక్‌లోని హిందువులకు రక్షణ లేదు. హిందువులను ఊచకోత కోసే సెక్యులరిజం మనకు అవసరం లేదు. దేశ సేవలో ప్రతి ఒక్కరూ భాగం కావాలి. భారత్‌ మాతాకీ జై’’ అంటూ పవన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని