పవన్ సినిమాల్లో నటిస్తే నష్టమేంలేదు..కానీ!
close
Published : 31/01/2020 16:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్ సినిమాల్లో నటిస్తే నష్టమేంలేదు..కానీ!

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి 

అమరావతి: జనసేన పార్టీకి సీబీఐ పూర్వ జేడీ వీవీ లక్ష్మీనారాయణ రాజీనామా వ్యవహారంపై మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి స్పందించారు. తన పూర్తి జీవితం ప్రజాసేవకేననీ.. సినిమాల్లో నటించబోనంటూ అనేక సార్లు చెప్పిన పవన్‌ మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా ఆయనకు నిలకడైన రాజకీయ విధానాలు లేవని తెలుస్తోందని పేర్కొంటూ లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖను పవన్‌కు నిన్న పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమిరెడ్డి ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘లక్ష్మీనారాయణ గారూ.. ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించడం చూశాం. పవన్‌ కల్యాణ్‌ ఒకట్రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టమేంలేదు. కానీ, రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం’’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇదీ చదవండి

సినిమాలు చేయటం నాకు తప్పనిసరి: పవన్‌



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని