నిరుద్యోగం యాదృచ్ఛికమా? మీ ప్రయోగమా?
close
Published : 05/02/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిరుద్యోగం యాదృచ్ఛికమా? మీ ప్రయోగమా?

మోదీ వ్యాఖ్యలపై ప్రియాంక గట్టి కౌంటర్‌

దిల్లీ: దేశంలో 35 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగం పెరగడం యాదృచ్ఛికమా? ప్రధాని చేసిన ప్రయోగమా? అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రశ్నించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలనుద్దేశించి ప్రధాని మోదీ నిన్న దిల్లీలో చేసిన వ్యాఖ్యలకు ఆమె గట్టి కౌంటర్‌ ఇచ్చారు. మంగళవారం దిల్లీలోని సంగమ్‌ విహార్‌లో రాహుల్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఐదేళ్లలో ఏడు ప్రముఖ రంగాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలు పోయాయని ఓ నివేదిక చెప్పినట్టు ఈ సందర్భంగా ప్రియాంక ప్రస్తావించారు. ప్రధాని ఎప్పుడు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడినా నిరుద్యోగం గురించి నోరుమెదపరన్నారు.  నేడు దేశంలో నెలకొన్న ఈ తీవ్ర నిరుద్యోగ సమస్యకు కారణం యాదృచ్ఛికమా?.. ఆయన చేసిన ప్రయోగమా? మోదీ చెప్పగలరా అని ప్రశ్నించారు. 
దిల్లీని యూపీలా మార్చాలనుకుంటున్నట్టు భాజపా నేతలు చెబుతున్నారనీ.. అక్కడ నేరాలు, అరాచకత్వమే గానీ అభివృద్ధి కానరావడంలేదంటూ మండిపడ్డారు. ప్రచారం కోసం భాజపా, ఆప్‌ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని ప్రియాంక ఆరోపించారు. దివంగత నేత షీలాదీక్షిత్‌ చేపట్టిన కార్యక్రమాల క్రెడిట్‌ను ఆప్‌ తన ఖాతాలో వేసుకుంటోందన్నారు. 

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండటం యాదృచ్ఛికం కాదని... ఇది జాతి ఐక్యమత్యాన్ని దెబ్బతీసే కుట్రపూరిత రాజకీయ ప్రయోగమంటూ ఎన్నికల ప్రచార సభలో నిన్న మోదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని